లక్నో : జరగబోయే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ పోటీ చేయనుంది అని ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. జాతీయ పార్టీగా అవతరించే ప్రయత్నంలో భాగంగానే ఆ రాష్ట్రంలో ఎస్‌పి పోటీ చేయనుందని అఖిలేష్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్‌లో తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ పోటీ చేస్తోంది. చిన్న చిన్న రాష్ట్రాల్లో పోటీ చేయడం వల్ల ఆ పార్టీ జాతీయ పార్టీగా మారడానికి దోహదం చేస్తాయి’ అని ఆయన అన్నారు.