అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలి

– తుమ్మల వెంకటరెడ్డి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు
నవతెలంగాణ – గోవిందరావుపేట
అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం రుణమాఫీ వర్తింపచేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం మండలం కేంద్రంలో తెలంగాణ రైతు  సంఘం మండల కమిటీ సమావేశం గుండు రామస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వెంకటరెడ్డి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ మాఫీ చేస్తామని పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకంలోని గైలెన్స్ ఆధారంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. దీనివలన అర్హులైన రైతులందరికీ ఇది వర్తించదు .ధరణి  పట్టాదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఏజెన్సీలో అనేక మంది రైతులకు పట్టాలు లేక పహాని ద్వారా, మీసేవ పహాని, ద్వారా అనేక మంది రైతులు బ్యాంకులలో రుణాలు తీసుకున్నారు తెలంగాణ వ్యాప్తంగా అదిలాబాదు నుండి భద్రాచలం వరకు ఏజెన్సీ ఏరియాలలో ఈ సమస్య ఉన్నది కావున విశాలమైన రైతు ప్రయోజనాలు దృష్టిపెట్టుకొని ప్రభుత్వం బ్యాంకులలో వ్యవసాయం పేరుతో తీసుకున్న అన్ని రకాల అప్పులను అర్హులైన రైతులందరికీ మాఫీ చేయాలని, లేనియెడల పెద్ద ఎత్తున రైతుల సమీకరించి ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు తీగల ఆదిరెడ్డి, సామచంద్రారెడ్డి  కన్నోజు సదానందం, ఖ్యాతం సూర్యనారాయణ, సప్పిడి ఆదిరెడ్డి, కాపకోటేశ్వరరావు  మారబోయిన సారయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love