అఖిలభారత కిసాన్ సభ జెండా ఆవిష్కరణ కార్యక్రమం

Flag hoisting ceremony of All India Kisan Sabhaనవతెలంగాణ – ఆర్మూర్
పట్టణం కేంద్రంలో శాస్త్రి నగర్ కార్యాలయం ముందు అఖిలభారత రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అఖిలభారత రైతు సంఘం 1936 ఏప్రిల్ 11న ప్రారంభించడం జరిగిందని తెలిపారు. నాటి నుండి నేటి వరకు అఖిలభారత కిసాన్ సభ ఆధ్వర్యంలో దశయాప్తంగా అనేక ఉద్యమాలు జరిగాయని ఆయన అన్నారు. అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వర్లి ఆదివాసీల తిరుగుబాటు బెంగాల్లో తేబాగ పోరాటం కేరళలో వాయిలార్ పోరాటం జరిగిందని ఆయన అన్నారు. ఇప్పటికి నేటి పాలకులు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతాంగాన్ని దగా చేస్తున్నారని రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. రైతు లకు సబ్సిీలను తొలగిస్తున్నారు నకిలీ విత్తనాలు, రైతులకు ఇచ్చి మొలకలు రాకుండా నష్టపోత ఉన్నారు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాడం లేదు అన్నారు రైతులకు గిట్టబాటు బాటు ధరలకు నికరం గా పోరాటం చేస్తుంది అన్నారు భూమి మొత్తం కొంత మంది చేతులలో కేంద్రీకృతం అయింది అన్నారు రానున్న రోజుల్లో రైతు సమస్యల పై సమర శిల పోరాటం కు రైతులను ఐక్యం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్సుడు టి భుమన్న నాయకులు, గణేష్, గంగారాం, ఎల్లయ్య, శర్మ,అమీర్ ఖాన్,సిరజ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love