కౌంటింగ్ కు సర్వం సిద్ధం..

– మూడంచేల భద్రత..
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపుకు స్థానిక అరోరా కళాశాలలో సర్వం సిద్ధమైంది. ఓట్ల లెక్కింపు ప్రాంతంలో పోలీసులు మూడు అంచేల భద్రతా చర్యలు చేపట్టారు.  భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గ పరిథిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈనెల 4 వ తేదీన అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి  పూర్తయ్యాయి. నియోజకవర్గాలుగా టేబుల్లు, రౌండ్లు
ఇబ్రహింపట్నం నియోజక వర్గం 343 పోలింగ్ కేంద్రాలకు గాను 20 టేబుల్లు,18 రౌండ్లు, మునుగోడు సంబంధించి 317 పోలింగ్ కేంద్రాలకు గాను 18 టేబుల్స్, 18 రౌండ్లు, భువనగిరి సంబంధించి 257 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 14 టేబుల్లు, 19 రౌండ్లు, నకిరేకల్ సంబంధించి 311 పోలింగ్ కేంద్రాలకు గాను 14 టేబుల్లు, 23 రౌండ్లు, తుంగతుర్తి సంబంధించి 326 పోలింగ్ కేంద్రాలకు గాను 18 టేబుల్స్, 19 రౌండ్లు, ఆలేరు సంబంధించి 309 పోలింగ్ కేంద్రాలకు గాను 14 టే బుల్లు, 23 రౌండ్లు, జనగాం సంబంధించి 278 పోలింగ్ కేంద్రాలకు గాను 14 టేబుల్లు, 20 రౌండ్ల ద్వారా కౌంటింగ్   నిర్వహించనున్నారు. ఇవిఎం కౌంటింగ్ సంబంధించి ప్రతి టేబులు ఒక కౌంటింగ్ సూపర్వైజరు, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ , మైక్రో అబ్జర్వర్తో కలిసి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రౌండ్ ప్రకారం రిజల్టు నమోదు చేస్తారు, పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ప్రత్యేక హాల్ ఏర్పాటు చేశారు, హోమ్ ఓటింగ్, విధులలో వున్న సిబ్బంది సంబంధించిన ఓట్లను 14 టేబుల్స్ ద్వారా కౌంటింగ్ జరుగుతుంది, ఒక టేబుల్కు ఒక సూపర్వైజరు, ఇద్దరు అసిస్టెంట్లు, తహశీలుదారు స్థాయి ఎ.ఆర్.ఓ.ఉంటారు.14 టేబుల్స్ సంబంధించి ఎ.ఆర్.ఓ. లను కేటాయిస్తారు. దీనితో పాటు సర్వీసు ఓటర్లకు సంబంధించి ఇటిపిబిఎస్ పద్దతిలో స్కానింగ్ ద్వారా కౌంటింగ్ నమోదు చేయబడుతుంది.ఇద్దరు అబ్జర్వర్లు రాబర్ట్ సింగ్ క్షేత్రమయిమ్, ఎం.డి. ఎజబా హుస్సేన్ కౌంటింగ్ ప్రక్రియలను పరిశీలిస్తారు . బందోబస్తు ఏర్పాట్లలో భాగంగా కౌంటింగ్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి డ్యూటీ పాస్ అందజేశారు.  సిబ్బంది ఆరు గంటలకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్, ఇవిఎం బ్యాలెట్ కౌంటింగ్ ఉదయం 8.00 గంటలకు ప్ర్రారంభం అవుతుందని తెలిపారు.
మూడంచెల భద్రత ఏర్పాట్లు
అరోరా కాలేజీలో కౌంటింగ్ కోసం మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు, ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద సిఐపిఎఫ్ భద్రతా సిబ్బందితో పాటు స్టేట్ సాయుధ సిబ్బంది, ఎఆర్ ఫోర్స్, సివిల్ ఫోర్స్ ఉంటుంది, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశారు, పాస్లు లేకుండా ఎవరిని అనుమతించరు, పోలీసు బారికేడింగ్ నుండి వాహనాలను అనుమతించరు. రిటర్నింగ్ అధికారి, అబ్జర్వర్స్, అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలకు మాత్రమే అనుమతి  ఉంటుంది. మీడియా పాయింట్ కోసం ఏర్పాటు చేయనున్నారు, మీడియా సిబ్బంది ఎస్కార్ అధికారితో వెళ్లి కవర్ చేయవలసి ఉంటుంది, అభ్యర్ధులకు అన్ని సెగ్మెంట్లకు అనుమతి ఉంటుంది,  పోలీసు హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు.కౌంటింగ్ కేంద్రం పరిథిలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
పార్టీలు ఏజెంట్లకు అవగాహన. 
వివిధ రాజకీయ పార్టీలు ఓటు లెక్కింపు పద్ధతి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టిఆర్ఎస్ రెండు రోజుల క్రితమే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు సిపిఎం, కాంగ్రెస్  పార్టీలు సోమవారం ఏజెంట్లకు సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. కాంగ్రెస్ సిపిఎం , బి ఆర్ ఎస్, బిజెపి పార్టీలు ఏజెంట్లు సోమవారం సాయంత్రమే భువనగిరికి చేరుకోనున్నారు.
Spread the love