– హైదరాబాద్‌లో 12వేల చదరపు అడుగుల్లో స్టోర్ ప్రారంభం :ఆల్టెరో ఎండి చందన కోగంటి వెల్లడి
హైదరాబాద్: లగ్జరీ యూరోపియన్ ఫర్నీచర్ మార్కెట్లోకి ఆల్టెరో ప్రవేశించినట్లు ప్రకటించింది. మూడు అంతస్తుల్లో 12వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాదాపూర్ కావూరి హిల్స్‌లో ఏర్పాటైన తొలి స్టోర్‌ను కంపెనీ గురువారం ప్రారంభించింది. ప్రధానంగా యూరప్‌లో డిజైన్, తయారీ చేపట్టిన వినూత్న, నాణ్యమైన లగ్జరీ ఫర్నీచర్‌ను సరసమైన ధరల్లో విక్రయిస్తా మని ఆల్టెరో ఎండి చందన కోగంటి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ధర రూ.5 లక్షలతో ప్రారంభమై రూ.5 కోట్ల వరకు ఉంటుంద న్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో స్టోర్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. రియల్టీ రంగంలో వృద్థి మార్కెట్లలో హైదరాబాద్ ఒకటని చందన తెలిపారు. ‘నగరంలో అపార అవకాశాలు ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో లగ్జరీ హోమ్స్ వచ్చే అయిదేళ్లలో పెద్ద ఎత్తున వస్తున్నాయి. 6,000 నుంచి 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇవి ఏర్పాటవుతు న్నాయి. పెద్ద క్లయింట్స్ అంతా నాణ్యమైన, ఖరీదైన ఫర్నీచర్ కోరుకుంటారు. ఒకరి ఇంట్లో ఉన్నవి తమ ఇంట్లో ఉండకూడదన్న ఆలోచన కస్టమర్లలో ఉంది. అందుకే ప్రత్యేక, ఖరీదైన ఫర్నీచర్‌ను కోరుకుంటున్నారు. ఆల్టెరోకు ఈ అంశా లు కలిసి వస్తాయి. ఫర్నీచర్ రంగంలో ప్రత్యేకత చూపిస్తాం’ అని తెలిపారు.