తమతో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందగా స్పందించిన పూర్వ విద్యార్థులు రూ.28,500 ఆర్థిక సహాయాన్ని అందించి మిత్రులు కుటుంబాన్ని ఆదుకున్నారు. శనివారం మండల కేంద్రానికి చెందిన కుసుమ రమేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. తమతో చదువుకున్న మిత్రుడు తమ కళ్ళ ముందు అనారోగ్యం బారిన పడి మృతి చెందడం తోటి మిత్రులను కలచివేసింది. ఆర్థికంగా వెనుకబడిన రమేష్ కుటుంబానికి ఆసరాగా ఉండాలన్న తలంపుతో స్పందించిన పూర్వ విద్యార్థులు రూ.28,500 రమేష్ తల్లికి అందించి మిత్ర ఉదారతను చాటుకున్నారు. మిత్రుడు రమేష్ మృతి బాధాకరమని, రమేష్ కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చిన ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తామని రమేష్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మిత్రుడి కుటుంబానికి ఆర్థిక చేయూతను అందించిన పూర్వ విద్యార్థులను చాలామంది అభినందించారు. ఈ విధంగా ముందు ముందు ఇద్దరు కు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రమేష్ మిత్ర బృందం గుండెబోయిన పోషాలు, నిమ్మగడ్డ సతీష్, సూరినేని కుమార్, కుసుమ గోపి, వలపదాసు ఏడుకొండలు, పెరువాల సురేష్, వెల్లంకి శ్రీధర్, మిత్రలు పాల్గొన్నారు.