ఆశ్రయ్ విశ్రాంతి కేంద్రాల నెట్‌వర్క్‌ను 100కి విస్తరించనున్న అమెజాన్ ఇండియా

–       ఈ-కామర్స్ మరియు లాజిస్టిక్స్ రంగాలలోని  డెలివరీ అసోసియేట్‌లకు ఎయిర్ కండిషన్డ్ సీటింగ్, శుభ్రమైన తాగునీరు, ఎలక్ట్రోలైట్‌లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, వాష్‌రూమ్‌లు, ప్రథమ చికిత్స కిట్‌లు మరియు రిఫ్రెష్‌మెంట్ సౌకర్యాలను అందించే ప్రత్యేక విశ్రాంతి కేంద్రాలు, ఆశ్రయ్ కేంద్రాలు.

–       ఆశ్రయ్ కేంద్రాలు డెలివరీ అసోసియేట్‌లందరికీ  ఉచితంగా అందుబాటులో ఉంటాయి.

అమెజాన్ ఇండియా 2025 సంవత్సరాంతానికి భారతదేశం అంతటా తమ ఆశ్రయ్ కేంద్రాల నెట్‌వర్క్‌ను 100కు విస్తరించేందుకు తగిన ప్రణాళికలు ఈరోజు ప్రకటించింది.  ఈ-కామర్స్ , లాజిస్టిక్స్ రంగాలలోని డెలివరీ అసోసియేట్‌లకు ఎయిర్ కండిషన్డ్ సీటింగ్, శుభ్రమైన తాగునీరు, ఎలక్ట్రోలైట్‌లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, వాష్‌రూమ్‌లు, ప్రథమ చికిత్స కిట్‌లు మరియు రిఫ్రెష్‌మెంట్ సౌకర్యాలను అందించే ప్రత్యేక విశ్రాంతి కేంద్రాలు, ఆశ్రయ్ కేంద్రాలు. ఈ ప్రయత్నం పరిశ్రమలోనే తొలిసారిగా జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో డెలివరీ అసోసియేట్‌లు , లాజిస్టిక్స్ భాగస్వాములకు ప్రత్యేక విశ్రాంతి కేంద్రాలను అందించడానికి రూపొందించబడింది. పెట్రోల్ పంపులు , వాణిజ్య అద్దె స్థలాల వద్ద ఉన్న ఈ కేంద్రాలు అవసరమైన సౌకర్యాలను కలిగి ఉంటాయి . ఆశ్రయ్ కేంద్రాలు వారంలో 7 రోజులు, ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయి, ఇక్కడకు వచ్చిన  డెలివరీ అసోసియేట్‌లకు ప్రతి సందర్శనకు 30 నిమిషాల వరకు ఉచితంగా గడిపే అవకాశం అందిస్తారు . ఏ సమయంలోనైనా 15 మంది వరకు ఇక్కడ విశ్రాంతి తీసుకునే సామర్థ్యం ఉంటుంది. ఈ కేంద్రాలు సౌకర్యవంతమైన పార్కింగ్ స్థలాలను కూడా అందిస్తాయి.

అమెజాన్‌ వద్ద  ఇండియా & ఆస్ట్రేలియా ఆపరేషన్స్ విపి  అభినవ్ సింగ్ మాట్లాడుతూ, “డెలివరీ అసోసియేట్‌ల ఆరోగ్యం, శ్రేయస్సు మరియు సౌకర్యం మాకు  ప్రధానం. ఆశ్రయ్ కేంద్రాలు స్వచ్ఛమైన తాగునీరు, ప్రథమ చికిత్స వస్తు సామగ్రి మరియు ఛార్జింగ్ పాయింట్లు వంటి ముఖ్యమైన సౌకర్యాలతో ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి ప్రాంగణాలను అందిస్తాయి. ఈ సౌకర్యాలు డెలివరీ అసోసియేట్‌లు తమ  బిజీ షెడ్యూల్‌లలో సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా ఉండటానికి సహాయపడతాయి. ఈ-కామర్స్ , లాజిస్టిక్స్ పర్యావరణ వ్యవస్థలోని డెలివరీ అసోసియేట్‌లకు ఈ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావటం , మొత్తం లాజిస్టిక్స్ కమ్యూనిటీకి మద్దతు ఇస్తుంది , పరిశ్రమ ప్రమాణాలను పెంచడంలో మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఇప్పటివరకు మేము చూసిన ప్రతిస్పందన ద్వారా మేము ప్రోత్సహించబడ్డాము. ఈ కార్యక్రమంను భారతదేశం అంతటా 100 అటువంటి కేంద్రాలకు విస్తరించడానికి కట్టుబడి ఉన్నాము” అని అన్నారు.
ప్రారంభం నుండి, ఆశ్రయ్ కేంద్రాలు వేలాది సందర్శనలను నమోదు చేశాయి, చివరి మైలు కమ్యూనిటీకి ఈ కార్యక్రమం  కోసం పెరుగుతున్న డిమాండ్ మరియు అవసరాన్ని ప్రదర్శించాయి. ఈ విస్తరణ డెలివరీ అసోసియేట్‌లకు అవకాశాలను మరింత పెంచుతుందని, కస్టమర్ ఆర్డర్‌లను వారికి చేరువ చేసేటప్పుడు  డెలివరీ అసోసియేట్లకు తగిన  విశ్రాంతి తీసుకోవడానికి , రీఛార్జ్ చేయడానికి నమ్మకమైన స్థలాలు ఉన్నాయని నిర్ధారిస్తుంది.

Spread the love