– ఎన్ హెచ్ ఆర్సీ ఆధ్వర్యంలో అంబెడ్కర్ 134వ జయంతి వేడుకలు.
నవతెలంగాణ – మల్హర్ రావు:
ప్రపంచ మేధావి,బారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ అందరివాడని,ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ముడుతానపల్లి ప్రభాకర్ అన్నారు.సోమవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో అంబెడ్కర్ 134వ జయంతి వేడుకలు ఎన్ హెచ్ ఆర్సీ మండల అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం మాట్లాడారు అంబెడ్కర్ ఆశయసాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.సమసమాజ నిర్మాణానికి, స్వేచ్ఛ, సమాత్వం పెంపొందించడానికి అంబెడ్కర్ సిద్దాంతాలు.ఉపయోగపడతాయన్నారు.బారత రాజ్యాంగ నిర్మాత,బారత తొలి న్యాయశాఖ మంత్రిగా ఎన్నో సేవలందించిన మహోన్నత వ్యక్తిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఆర్సీ సభ్యులు చొప్పరి రాజయ్య,గుగ్గిళ్ల రాజ్ కుమార్,ఇందారపు రామస్వామి,ఇందారపు సాగర్,తాండ్ర సామెల్ పాల్గొన్నారు.