
మండలం లోని పసరా గ్రామం సుందరయ్య నగర్ లో సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా అంబాల మురళి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయాన్ని సాధించే దిశగా ప్రతి ఒక్కరు కృషిచేయాలని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఈ దేశంలోని అనేక సబ్బండ జాతులకు అనగారిన వర్గాలకు మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పిస్తూ ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన మహోన్నత వ్యక్తి ఆయన రాసిన భారత రాజ్యాంగంలోని చట్టాలను నీరుగారిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు భారత రాజ్యాంగాన్ని మనం అందరం కాపాడుకోవాలని గుర్తు చేశారు అదేవిధంగా మతోన్మాద శక్తులను తరిమికొట్టాలని ఈ దేశంలో రాష్ట్రంలో మతోన్మాదం పెరిగిపోతుందని పాలకవర్గాలు, వి విధ మతాలను రెచ్చగొట్టే మతోన్మాదులను అరికట్టాలని సూచించారు . కార్యక్రమంలో శ్రీరామోజు సువర్ణ కొమ్ము రాజు కొండయ్య అచ్చమ్మ లలిత గొడుగు సమ్మక్క రమేష్ అంజత్ అంకుష్ కృష్ణ పోలబోయిన ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు