బస్వాపూర్ లో సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి  వేడుకలు…

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్. సిపిఐఎం పార్టీ సభ్యుడు సురేష్ గొండ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశి నివాళులు అర్పించి జయంతి వేడుకలను ప్రారంభించారు గ్రామంలో ర్యాలీగా వెళ్తూ అంబేద్కర్ రాజ్యాంగం నిర్మాత బడుగు వర్గాలకు అంబేద్కర్ చేసిన సేవలను వక్తలు ఉపన్యాసించారు. ఈ సందర్భంగా గ్రామ తాజా మాజీ సర్పంచ్ రవి పటేల్ మాజీ సర్పంచ్లు సురేష్ గొంగడి , మారుతి , గ్రామస్తులు , దళిత సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు,  మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love