
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కో ఆర్డినేటర్ వరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు కాడారం వినయ్ కుమార్ సమక్షంలో కామారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా బట్టెంకి బాల్ రాజు ను అధికారంగా నియమించడం జరిగిందనీ వరుణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా బాలరాజుకు జాతీయ కో ఆర్డినేటర్ వరుణ్ కుమార్ భారత రాజ్యాంగం బుక్ ను బహుకరించరు. అనంతరం బట్టెంకి బాలరాజు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ను విస్తృతం చేసి బాబాసాహెబ్ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ భావజాలం ను ప్రజల వద్దకు చేర్చడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం కు సహకరించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బొంద రాజ్ కుమార్ కు,రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగం శ్రీశైలం కు, రాష్ట్ర కార్యదర్శి చెవ్వ లింగం లకు ప్రత్యేకమైన ధన్యవాదములు తెలుపుతున్నానన్నారు.