కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కొడకండ్ల ఏఎంసీ డైరెక్టర్ కుందూరి మదన్మోహన్ రెడ్డి తల్లి నిర్మలమ్మ (85) వృద్ధాప్యంతో బుధవారం మృతి చెందారు. ఆమె పార్థివదేహానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, మార్కెట్ డైరెక్టర్ బానోత్ గోపాల్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి ఓరిగంటి సతీష్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు సీతారాం నాయక్, మండల యూత్ అధ్యక్షులు హరికృష్ణ గౌడ్, బానోత్ వెంకన్న, గ్రామ పార్టీ అధ్యక్షులు రసాల కొమురయ్య, మాజీ ఎంపీటీసీ సోమన్న నాయక్, దేవా, సుధాకర్, రమేష్, సురేష్ ఉన్నారు.