ప్రభుత్వం ఉగాది నుండి రేషన్ వినియోగదారులకు సన్న బియ్యం పంపిణీతో నిరుపేదల్లో ఆనందం వ్యక్తమవుతుందని మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ అన్నారు. డోంగ్లి మండలంలోని మోగా గ్రామంలోని రేషన్ షాపులు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సన్నబియ్యం పంపిణీతో నిరుపేద రేషన్ లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగ్రామ్ పటేల్, హనుమంత్ పటేల్, రవి పటేల్, సుధాకర్ గౌడ్, మోహిన్ సంతోష్, తదితరులతోపాటు రేషన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.