అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాలు పూర్తి చేయాలి

– జిల్లా సెర్ప్‌ ఎపిడి చరణ్‌ దాస్‌
నవతెలంగాణ-జగిత్యాలటౌన్‌
ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న వివిధ పనులకు నిర్దేశించిన గడువు లోగా మంచి నాణ్యతతో పూర్తి చేయించాలని జిల్లా సెర్ప్‌ ఎపిడి చరణ్‌ దాస్‌ అన్నారు. జగిత్యాల మండల సమాఖ్య కార్యాల యంలో జగిత్యాలరూరల్‌, అర్బన్‌ మండలాల మహిళ సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు నాణ్యతతో పనులు పూర్తి చేయించాలని, అలాగే గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డ్రస్‌లు కుట్టి గడువులోగా అందివ్వాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ లింకేజీ నూతన టార్గెట్‌ ఇవ్వడం జరిగిందని, రూరల్‌ మండలం 890 సంఘాలకు 55 11 కోట్లు, అర్బన్‌ మండలం 169 సంఘాలకు 9.92 కోట్ల లింకేజీ టార్గెట్‌ కేటాయించడం జరిగిందన్నారు. ఎప్పటికప్పుడు అర్హత గల సంఘాలకు రుణాలు అందేలా చూడాలని అన్నారు. జగిత్యాల రూరల్‌ ఎంపీడీవో రమ దేవి, అర్బన్‌ ఎంపీడీవో విజయ లక్ష్మి మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళ సంఘాల సభ్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం జరుగు తుందన్నారు. అందు కోసం మహిళ సంఘాల సభ్యులు గ్రామాల్లో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెర్ప్‌ డిపీఎంలు విజయలక్ష్మి, మాణిక్‌రెడ్డి, వెంకటేశం, మండల ఎపియం వి.గంగాధర్‌, సీసీలు రవీందర్‌, సాగర్‌, మరియా, గంగారాం, రూరల్‌ అధ్యక్షురాలు యం సత్తవ్వ, అర్బన్‌ అధ్యక్షురాలు డి.గంగభావని పాల్గొన్నారు.

Spread the love