నవతెలంగాణ:రెంజల్ : మండల కేంద్రమైన రెంజల్ లో అమ్మ మాట అంగన్వాడి బాట అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి పేర్కొన్నారు. దీనిలో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు, అక్షరభ్యాసం, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. పిల్లల తల్లులకు ఫ్రీ స్కూల్ లో వచ్చిన కరికులం గురించి వివరించడం జరిగింది. అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు ఎల్కేజీ యూకేజీ టెక్స్ట్ బుక్ లను ఇవ్వడమే కాకుండా వారికి వాటిపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. గర్భవతులు సకాలంలో తమ పేర్లను అంగన్వాడి కేంద్రాల్లో నమోదు చేయించుకొని పౌష్టికాహారాన్ని పొందాలని ఆమె సూచించారు. పుట్టిన బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు తప్పనిసరిగా అందించాలని అప్పుడే తల్లి బిడ్డ ఆరోగ్యం గ ఉంటారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏపీసీసీలు శ్యామల, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.