అమ్మ ఆదర్శ పనులను త్వరగా పూర్తి చేయాలి

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను త్వరగా పూర్తిచేయాలని డిఆర్డీఓ, మండల ప్రత్యేక అధికారి  సాయ గౌడ్ అన్నారు.  బుధవారం మండలంలోని హాస కొత్తూర్, బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనే  ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల పనులను చేపట్టిందన్నారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా పనుల్ని త్వరగా పూర్తి చేసి  అందుబాటులోకి తీసుకొస్తే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో అలసత్వం వహించకుండా పనులు వేగవంతం  చేసి పూర్తిచేసేలా చూడాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ కు సూచించారు. హాస కొత్తూర్ లో విద్యార్థుల త్రాగునీటి ఇబ్బందులు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన స్టీల్ వాటర్ ట్యాంక్, విద్యార్థులు నీటిని పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన నల్లాలను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట మండల పంచాయతీ అధికారి  సదానంద్, ఈజీఎస్ ఏపిఓ విద్యానంద్, తదితరులు ఉన్నారు.
Spread the love