నవతెలంగాణ-ముషీరాబాద్
ముషీరాబాద్ పోలీసులు ఓ పాతనేరస్తున్ని అరెస్టు చేసి అతన్ని వద్దనుంచి ఏడు తులాల బంగారు అభరా ణాలు, ద్విచక్రవాహనం, ఓ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని నిందితున్ని రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం ముషీ రాబాద్ పోలీసస్టేషన్ ఆవరణలో జరిగిన విలేకరుల సమా వేశంలో సెంట్రల్ జోన్ అక్షన్ యాదవ్ చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ ముషీరాబాద్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ తెలిపిన వివరాల ప్రకారం… తార్నాక సమీపంలోని లాలాపేటలో నివాసం ఉంటున్న అశోక్ కుమార్ గౌడ్ తార్నాకలోని నియోలాగ్ ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలో పనిచేస్తున్నాడు. కాగా ఈనెల 2వ తేదిన రాంనగర్ లోని సెయింట్పొయిన్ హైస్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న జి అనంతలక్ష్మి ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లోని బీరువాలో గల ఏడు తులాల బంగారు అభరణాలు అపహరించుకొని పరార య్యాడు . దీంతో బాధితురాలు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుని కోసం సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. నిందితుడు మౌలాలికి చెందిన అశోక్ కుమార్ గుర్తించారు. అతని పై నిఘా పెట్టి పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా ముషీరాబాద్ చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా అశోక్ కుమార్ గౌడ్ పోలీసులను అనుమానంగా వ్యవహరిస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో రాంనగర్ లోని అనంతలక్ష్మి ఇంట్లో చోరి చేసిన ఏడుతులాల బం గారు నగలు స్వాధీనం చేసుకోవడంతోపాటు ద్విచక్రవాహనం. సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు. అశోక్ కుమార్ గతంలో నాచారం, సాయిగూడ, బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధులలో ఎనిమిది చోరి కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు తెలిపారు. అశోక్ కుమార్ అరెస్ట్ చేసిన ఘటనలో కషి చేసిన డీఐ తో పాటు ఇతర క్రైం సిబ్బందిని డీసీపీ అభినందించారు. ఈ కేసును ముషీరాబాద్ సీఐ నిరంజన్ పర్యవేక్షణలో డీఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.