మరి కాసేపట్లో సెమీ ఫైనల్ మ్యాచ్..భారీ వర్షం

నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యమిస్తోన్న టీ-20 వరల్డ్ కప్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్‌లో అడుగుపెట్టేందుకు ఇండియా, ఇంగ్లాండ్ సెమీస్‌లో తాడో పేడో తేల్చుకోబోతున్నాయి. ఇందులో భాగంగానే వెస్టిండీస్‌లోని గయానా స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఇండియా, ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచులో తలపడబోతున్నాయి. రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మరి కొన్ని నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ కానున్న క్రమంలో ఈ మ్యాచ్‌కు వరుణుడు అటంకం కలిగించేలా ఉన్నాడు. సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ జరగనున్న గయానా స్టేడియంతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరి‌కొన్ని నిమిషాల్లో మ్యాచ్ ప్రారంభం కానుండగా.. వర్షం కురుస్తుండటంతో అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు. సెకండ్ సెమీఫైనల్‌కు రిజర్వ్ డే కూడా లేదు. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దు అయితే సూపర్-8 రౌండ్‌లో అగ్రస్థానంలో ఉన్న భారత్ నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. ఈ నెల 29న టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సౌతాఫ్రికా ఫైనల్‌కు చేరుకోగా.. సెకండ్ సెమీస్‌లో విజయం సాధించిన టీమ్ సౌతాఫ్రికాతో తలపడనుంది.

Spread the love