రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..మరోకరికి గాయాలు

నవతెలంగాణ – అశ్వారావుపేట : లారీ,ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒ వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్, పోలవరం మండలం శివ గిరి కి చెందిన నిర్వాసితులు మండల సరిహద్దులో జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం సమీపంలో ఆర్అండ్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇక్కడ నివాసం ఉండే నడకుదురు గోపిరెడ్డి (36), కె.అర్జున్ రెడ్డి అనే కొండ రెడ్లు మంగళవారం రాత్రి ఆంధ్రా లోని జీలుగుమిల్లి లో జరుగుతున్న జగదాంబ తల్లి జాతరకు వెళ్లారు.రాత్రి పదకొండున్నర గంటల సమయంలో ఇద్దరు ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వెళుతున్నారు.ఇదే క్రమంలో అశ్వారావుపేట లోని జంగారెడ్డిగూడెం రోడ్లో గల కాకతీయ గేట్ సమీపంలో కాకినాడ వైపు వెళుతున్న లారీ,ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ప్రమాదంలో గోపిరెడ్డి అక్కడిక్కడే మృతిచెందాడు.అర్జున్ రెడ్డికి పలుచోట్ల గాయాలు అ య్యాయి.అర్జున్ రెడ్డి ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.మృతుడు గోపిరెడ్డి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Spread the love