వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించిన ఏఓ నరేష్

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని  గౌరారం మరియు మేడిపల్లి గ్రామాల పరిధిలోని వరి మరియు మొక్క జొన్న పంటలను మండల వ్యవసాయ అధికారి నరేష్పరిశీలించడం జరిగింది ప్రస్తుతం వరిలో  కాండం తొలుచు పురుగు, ఆకుచుట్టు పురుగు వున్నట్లు గమనించటం జరిగింది వీటి నివారణ కోసం కార్టాప్ హైడ్రో క్లో రైడ్ 4G గుళికలు ఎకరానికి 8-10 కేజీలు లేదా కార్బోఫ్యురాన్ 3% G  గుళికలు ఎకరానికి 10 కేజీలు పొడి ఇసుకలో కలిపి చల్లుకోవడం పైన తెలిపిన రోగాలను నివారించవచ్చు. అదే విధంగా మొక్క జొన్న మరియు జొన్న పంటలో ప్రస్తుతం కాండం తొలుచు పురుగు,కత్తెర పురుగు వున్నట్లు గమనించటం జరిగింది వీటి నివారణ కోసం కార్బోఫ్యురాన్ 3% CG గుళికలు 3 కే జిలు ఎకరామొక్కజొన్న పంట సుడులలో వేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు, అదే విధంగా ఎమ్మామెక్టిన్ బెంజోఏట్ 5% SG 100 గ్రాములు ఎకరానికి లేదా క్లోరాన్ ట్రనిలిప్రోల్ 18.5%SL 80-100 మీ లి ఎకరానికి లేదా క్లోరంత్రిప్రోల్ 10%+ లాంబ్డా సహలోత్రిన్ 5 zc 100 మీ లి ఎకరానికి పిచికారి చేసి మంచి ఫలితాలు పొందవచ్చు.ఈ కార్యక్రమం లో ఏ ఈ ఓ లు దీక్షిత్ , జ్యోష్ణ,  రైతులు పాల్గొన్నారు
Spread the love