Tuesday, September 1, 2026
E-PAPER
Homeజాతీయంవెలిగొండ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు

వెలిగొండ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు

- Advertisement -

మార్కాపురం : ఆంధ్రపదేశ్‌ ‌ముఖ్యమంత్ని ఎన్‌ ‌చంద్రబాబునాయుడు వెలిగొండ ప్రాజెక్ట్‌‌ను ఫేజ్‌-1ను సోమవారం ప్రారంభించారు. అనంతరం దాన్ని జాతికి అంకింతం చేస్తున్నట్టు ప్రకటించారు. కృష్ణా నీటికి జలహారతి, పైలాన్‌ను ఆవిష్కరించారు. నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌‌పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2019లో ఈ ప్రాజెక్ట్‌‌కు గ్రహణం పట్టిందనీ, 2023లో వీడిందని చెప్పారు. రూ.4 వేల కోట్ల పనులను పెండింగ్‌లో ఉంచుకుని ఈ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేస్తున్నట్టు గత ప్రభుత్వం సిగ్గులేకుండా ప్రకటించుకున్నదని విమర్శించారు. నకిలీ నాటకాలు, సినిమా సెట్టింగులతో ప్రజలను, రైతులను మోసం చేశారంటూ మండిపడ్డారు. కార్యక్రమంలో ఆ రాష్ర్ట మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -