నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని శ్రీలక్ష్మి మండల సమాఖ్య సెర్ఫ్ డబ్ల్యూడిసి నిధుల గ్రౌండింగ్ ఆలస్యంపై సోమవారం భూపాలపల్లి జిల్లా ఏపిడి గోవింద జాదవ్ విచారణ జరిపినట్లు సమాచారం.అయితే ఈ విచారణ సిసి, సిఏలతో కార్యాలయంలో రహస్య సమావేశం నిర్వహించడంపై ఆంతర్యమేమిటో కానరాలేదు.ఇందుకు సాక్షాత్తు నిదర్శనం సమావేశ ఫొటోస్ బయటకు పొక్కకుండా చూడటమే.ఏపీఎం కమల నిర్లక్ష్యంగా డబ్ల్యూడిసి మండలంలోని పలు గ్రామాల్లోని ఎస్సీ ఎస్టీ పేద మహిళ సంఘాల సభ్యులకు ఆదాయం సమకూర్చే సదుద్దేశంతో 2022-23లో కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలైన డబ్ల్యూడిసి రూ.1.79 కోట్ల నిధులను ఏపిఎం మూడు నెలల్లో గ్రౌండింగ్ చేసి యూనిట్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి కానీ ఏపిఎం గత రెండేళ్లుగా అట్టి నిధులను గ్రౌండింగ్ చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో ఇటీవల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఆర్డీఓ ఏపీఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఉరుకుల పరుగులతో ఒకే రోజులో ఆయా గ్రామాల ఎస్సీ, ఎస్టీ నిరుపేద మహిళలకు రుణాలు మంజూరు చేసినట్లు తెలుస్తోంది.
నివేదికను కలెక్టర్ అందజేస్తాం…
రూ.1.79 కోట్ల డబ్ల్యూడిసి నిధులను విఏఓ సమైక్య గ్రూపు మహిళలకు అందజేయడంలో ఆలస్యంపై సోమవారం కొయ్యుర్ ఐకెపి కార్యాలయంలో ఎపిఎం, సిసి, సీఏ లతో విచారణ చేపట్టాం. ఇప్పటి వరకు గ్రామ సమైక్య సంఘాలకు నిధులు గ్రొoడింగ్ చేసినట్లుగా తెలిపారని,ఈ నివేదికను కలెక్టర్ కు అందజేస్తామని ఎపిడి తెలిపారు.డబ్ల్యూడిసి నిధుల వడ్డీ సైతం మండల సమాఖ్యలోనే జమైనట్లుగా తెలిపారు.