Tuesday, April 14, 2026
E-PAPER
Homeఆదిలాబాద్సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – సిర్పూర్ (టి ) :  తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనట్లు జిల్లా సమన్వయకర్త అధికారి ఎ. శారద మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, సాంఘిక సంక్షేమ గురుకుల సాధారణ జూనియర్ కళాశాలలు, ప్రతిభా వికాస కేంద్రాలు, వృత్తి విద్యా కోర్సులు, సైనిక కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఈనెల 6వ తేదీ నుండి 25వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మే 15వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని విద్యార్థినీ, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గురుకులాల్లో చేరాలని సూచించారు. బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అందించడంలో గురుకులాల పాత్ర కీలకమని ఆమె అన్నారు. ఇతర వివరాల కోసం సమీపంలోని గురుకుల పాఠశాలలను సంప్రదించవచ్చని, అలాగే సంబంధిత అధికారిక అంతర్జాల వేదికలను సందర్శించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -