వతెలంగాణ – పాల్వంచ
ఇందిరమ్మ ఇండ్ల తనిఖీలు నిర్వహించేందుకు గాను ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా నియమిస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలకు అర్హులైన నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 44 సంవత్సరాల వయస్సు లోపు కలిగి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ ఉద్యోగాల్లో మెరిట్ సాధించిన వారికి నెలకు 33,800/- రూపాయలు వేతనం చెల్లించడం జరుగుతుందని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 11 వ తేదీ లోపు తమ వివరాలను https://forms.gle/SxGUdm3S2WS2zGfZ9 online లో నమోదు చేసుకోవాలి అని కోరారు. Google ఫారం మరియు ఇతర వివరాలకు 8520860785 అనే ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని కోరారు.