
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో నియోజకవర్గంలో అత్యధిక ఇండ్లను సందర్శించి అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపులో కీలకపాత్ర పోషించినందుకు మానకొండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శానగొండ శ్రవణ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ విభాగంలో ప్రశంసలు అందుకున్నారు.బుధవారం హైదారాబాద్ లోని గాంధీ భవన యందు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జీ సురభి ద్వివేది, రాష్ట్రాధ్యక్షుడు శివసేన రెడ్డి,కరీంనగర్ జిల్లాధ్యక్షుడు పడాల రాహుల్ శ్రవణ్ ను అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు.