బిల్డర్ల కంటే ఆర్కిటెక్ట్‌లదే కీలక పాత్ర

– ఆర్‌ అండ్‌ బీ మినిస్టర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
నేటి సమాజంలో బిల్డర్ల కంటే ఆర్కిటెక్ట్‌లదే కీలక పాత్ర అని ఆర్‌ అండ్‌ బీ మినిస్టర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇంటీరియర్‌ డిజైనర్స్‌, హైదరాబాద్‌ చాప్టర్‌లోని ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్‌ డిజైనర్లు నిర్వహించిన ఎక్స్‌పో ఐదో ఎడిషన్‌ను డిజైన్‌ ఇంటెలిజెన్స్‌ థీమ్‌ హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హాజరై ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. వారితో పాటు ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, ఐఐఐడీ జాతీయ అధ్యక్షుడు సరోష్‌ వాడియా హాజరయ్యారు. సాయత్రం జరిగిన ఫెలోషిప్‌ మీట్‌లో, దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బరకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్‌ పీటర్‌ రిచ్‌, ఆర్‌.హెచ్‌ఐసీసీలో లోటస్‌ ఆర్కిటెక్ట్స్‌ సిద్ధార్థ్‌ తల్వార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ 50 ఏండ్ల ఐఐఐడీ చరిత్రలో ఐఐఐడీ షోకేస్‌ ఇన్‌సైడర్‌ ఎక్స్‌ 2024 5వ ఎడిషన్‌ను స్వాగతిస్తున్నామన్నారు. భారతదేశంలోని మెట్రో పాలిటన్‌ నగరాల్లో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉన్నం దున ఇలాంటి మరిన్ని ప్రదర్శనలను ఆహ్వానిస్తున్నా మన్నారు.

Spread the love