ఘనంగా నవరాత్రి ఉత్సవాల ఏర్పాటు

నవతెలంగాణ – ధర్మసాగర్
ముప్పారం గ్రామంలోని చారిత్రాత్మకమైన శ్రీ ముఖ్యనాథస్వామి దేవాలయంలో ఈ నెల 08 తారీకున జరిగే మహాశివరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాటు చేస్తున్నామని ఆలయ పునఃనిర్మాణం వ్యవస్థాపక చైర్మన్ శివసాని ప్రవీణ్ రవీంద్ర అన్నారు. సోమవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి శ్రీ ముఖ్యనాథస్వామి దేవస్ధానం కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి మహాశివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం అందజేశామన్నారు.అదే విధంగా ధర్మసాగర్ ఇన్స్పెక్టర్ ఏ మహేందర్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించడంతో పాటుగా ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అవరోధాలు ఏర్పడకుండా వారికి బందోబస్తు కల్పించాలని ఆలయ కమిటీ కోరారమన్నారు. ఉత్సవాలకు  విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్తును ప్రసాదింప చేయాలని స్థానిక ట్రాన్స్కో ఏఈ సుధాకర్ ను కోరడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో  మాజీ ఎంపీటీసీ మేకల విజయ్ కుమార్,మాజీ సర్పంచ్ గడ్డం రాజేందర్, TRS గ్రామ శాఖ అధ్యక్షులు బూర రమేష్, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు దారపు రాములు, ముఖ్య సలహాదారులు గుంటిపల్లి సంపత్ కుమార్, మారబోయిన యాదగిరి, చెల్లోజు నాగభూషణం, మర్రిపల్లి రాజయ్య, అన్నం సునీల్ కుమార్, కందుకూరి రాజు తధితరులు పాల్గొన్నారు.
Spread the love