– 12 కిలోల 765 గ్రాముల గంజాయి స్వాధీనం
నవతెలంగాణ-మల్హర్ రావు(మహాముత్తారం):
ప్రభుత్వ నిషేధిత గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి బుధవారం రిమాండ్ కు పంపినట్లుగా మహాముత్తారం ఎస్ఐ మహేందర్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా ఏర్పాటు చేయడంలో భాగంగా భూపాల పల్లి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ ఖారే ఆదేశాల మేరకు పక్కా సమాచారంతో బీహార్ రాష్ట్రానికి చెందిన గణేష్ ఠాకూర్ ( 49 ) నాయిబ్రాహ్మణుడు నలంద జిల్లాలో గౌరీ గ్రామంలో ఇతని స్వగ్రామం కాగా గత మూడు సంవత్సరముల నుండి ఘన్పూర్ మండలం చెల్పూరు గ్రామం లో రైస్ మిల్ నందు గుమాస్తాగా పనిచేస్తూ వచ్చే జీతం డబ్బులు సరిపోక అధిక మొత్తంలో డబ్బు సంపాదన ఆశతో విశాఖపట్నం మారుమూల ప్రాంతాల నుండి తక్కువ రేటుకు గంజాయి కొనుగోలు చేసి మహా ముత్తారం మండల పరిసర గ్రామాలలో దానిని ఎక్కువ ధరకు అమ్ముకొనుటకుగాను రాగా అతనిని ముందస్తు సమాచారంతో మహా ముత్తారం ఎస్సై మహేందర్ కుమార్ తన సిబ్బందితో కలిసి యామాన్ పల్లి గ్రామ శివారులో గల చెరువు వద్ద పట్టుకొని అతని వద్ద నుండి 12 కి లొ ల 765 గ్రాముల గంజాయిని సీజ్ చేసి అతనిపైన ఎన్ డి పి ఎస్ అక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. ఇంతకుముందు ఘన్పూర్ పోలీస్ స్టేషన్లో గంజాయి విక్రయిస్తూ పట్టుబడగా కేసు నమోదు చేసి జైలుకు పంపగా బెయిలు పై ఇటీవలే బయటికి వచ్చి మరల అదేవిధంగా గంజాయి రవాణా చేయగా పట్టుబడవడమైనది. ఈ విధంగా ఎవరైనా గంజాయిని సరఫరా చేసిన కలిగి ఉన్న వాడుతున్న వారి పైన కఠిన తరంగా చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాటారం సిఐ నాగార్జున రావు,సిసిఎస్ ఎస్ఐ భాస్కర రావు,మహా ముత్తారం ఎస్సై మహేందర్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు