విద్యార్దులే ఉపాధ్యాయులుగా..!

నవతెలంగాణ-పెద్దవూర : మండలం లోని పెద్దగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఘనంగా స్వపరిపాలన దినోత్సవం మరియు టై బెల్టుల ఉచిత పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు మర్రి చెన్నయ్య  బహూకరించిన గేటును మండల విద్యాధికారి తరి రాము స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ శ్రీనివాసులు  పాఠశాల ప్రధానోపాధ్యాయులు లావూరి శంకర్, గేటు దాత మర్రి  చెన్నయ్య  మరియు గ్రామ పెద్దలు కలిసి గేటును ప్రారంభించారు.అనంతరం మండల విద్యాధికారి తరి రాము  విద్యార్థులను ఉపాధ్యాయులను గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు.విద్యార్థులకు టై బెల్ట్ పంపిణీ చేయడం జరిగిందని విద్యార్థులు అందరూ సపరిపాలన దినోత్సవం నిర్వహించడం వల్ల వారిలో మానసిక ఉల్లాసం కలుగు తుందని అన్నారు. కలెక్టరు, డిఇఓ, ఎంఈఓ,ప్రధానోపాధ్యాయులు టీచర్లుగా తదితర పాత్రలు తనదైన శైలిలో పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ శ్రీనివాసులు, పెద్దగూడెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణ రెడ్డి, వెల్మ గూడెం మరియు చిన్న గూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన్నెం వెంకటేశ్వర్లు,  శ్రీనివాస్ రెడ్డి  మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లావూరి శంకర్,  పాఠశాల ఉపాధ్యాయులు మన్నెం సౌజన్య గోశిక,రవితేజ  మాజీ సర్పంచ్ కూన్ రెడ్డి మల్లారెడ్డి, కూన్ మంగారెడ్డి, చెన్ను సత్యనారాయణరెడ్డి- రజిత, మర్రి శ్రీను, సైదులు,అంజయ్య,తదితరులు పాల్గొన్నారు.
Spread the love