న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి టైటిల్ వేటలో ఢిల్లీ క్యాపిటల్స్ తన ‘ఓజీ’ గ్యాంగ్‌ను ఒక్కటి చేస్తోంది!. రిషబ్ పంత్‌ను లక్నో సూపర్‌జెయింట్స్ నుంచి ట్రేడింగ్‌లో సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని హెడ్ కోచ్‌గా నియమించింది. యువరాజ్ సింగ్ బ్యాటింగ్ కోచ్‌గా ఖరారైనా, ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 2026 ఐపీఎల్‌ను ఆరో స్థానంతో ముగించిన ఢిల్లీ క్యాపిట్స్ కోచింగ్ సిబ్బందిని మార్పు చేసేందుకు సిద్ధమైంది. గత రెండేండ్లు హేమంగ్ బదాని డీసీ చీఫ్ కోచ్‌గా పనిచేశారు. టీమ్ డైరెక్టర్ వేణు గోపాల్‌రావు, బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్, ఇయాన్ బెల్ (సహాయక కోచ్)లను సైతం తొలగించే అవకాశం ఉంది.







కామెంట్‌లు (0)