నవతెలంగాణ-హైదరాబాద్ : రెండు రోజుల పాటు సాగిన మెరుగు మల్టీస్పోర్ట్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో వెన్నెల, ధనుష్ సింగిల్స్ విజేతలుగా నిలిచారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో మైత్రిపై వెన్నెల గెలుపొందగా, మెన్స్ సింగిల్స్ ఫైనల్లో జోసెఫ్‌పై ధనుష్ నెగ్గాడు. మహిళల డబుల్స్‌లో వెన్నెల, మౌనిక జోడీ టైటిల్ సాధించగా, పురుషుల డబుల్స్‌లో పర్నీత్, భరత్‌లు గెలుపొందారు. మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను అభిషేక్, వర్షిత సొంతం చేసుకున్నారు. విజయ్‌కుమార్, మహేశ్, సబర్వాల్‌లు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
బ్యాడ్మింటన్ విజేతలు వెన్నెల, ధనుష్
23 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)