Magazines

హెచ్‌‌సీఏ సీఈవోగా గిరీశ్‌ డొంగ్రె

2 గంటల క్రితం

CEO
avatar
balaji

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ‌క్రికెట్‌ అసోసియేషన్‌ (‌హెచ్‌సీఏ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (‌సీఈవో)గా గిరీశ్‌ ‌డొంగ్రె గురువారం బాధ్యతలు చేపట్టారు. భారత సీనియర్‌ ‌మెన్స్‌ ‌జట్టుకు రెండేండ్ల పాటు అడ్డినిస్ర్టేషన్‌ ఆఫీసర్‌‌గా పని చేసిన గిరీశ్‌ ‌డొంగ్రె ఆ సమయంలో బోర్డు కార్యదర్శి జై షాతో కలిసి పని చేశారు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)కు చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌‌గా బాధ్యతలు నిర్వర్తించిన గిరీశ్‌ ‌డొంగ్రె తాజాగా హైదరాబాద్‌ ‌క్రికెట్‌ అసోసియేషన్‌‌లో కీలక బాధ్యతలు చేపట్టారు. భారత క్రికెట్‌‌తో పాటు హైదరాబాద్‌ ‌క్రికెట్‌‌లో గిరీశ్‌‌కు మంచి అనుభవం ఉంది. సీఈవోగా బాధ్యతలు చేపట్టిన గిరీశ్‌ ‌డొంగ్రెకు హెచ్‌‌సీఏ కార్యదర్శి మన్నె జీవనర్‌‌రెడ్డి అభినందనలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్