ఒక్క వికెట్ తేడాతో చత్తీస్‌గఢ్‌పై గెలుపు
ఛేదనలో అభిరథ్, వరుణ్, అనికెత్ రెడ్డి మెరుపులు
నవతెలంగాణ-హైదరాబాద్
హదరాబాద్ అదరగొట్టింది. తృటిలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం చేజారినా.. ఆఖరు వికెట్ హైడ్రామా నడుమ సాగిన థ్రిల్లర్‌లో విజయాన్ని వదిలిపెట్టలేదు. టెయిలెండర్లు అనికెత్ రెడ్డి (39 నాటౌట్, 56 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), రక్షణ్ రెడ్డి (15 నాటౌట్, 66 బంతుల్లో 1 సిక్స్) పదో వికెట్‌కు అజేయంగా 104 బంతుల్లో 39 పరుగుల అద్భుత భాగస్వామ్యం నమోదు చేసి చత్తీస్‌గఢ్‌పై హైదరాబాద్‌కు ఒక్క వికెట్ తేడాతో ఘన విజయాన్ని కట్టబెట్టారు. 254 పరుగుల సవాల్‌తో కూడిన ఛేదనలో హైదరాబాద్ 198 పరుగులకే 8 వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో వరుణ్ గౌడ్ (55, 95 బంతుల్లో 3 ఫోర్లు) స్ఫూర్తిదాయక అర్థ సెంచరీతో హైదరాబాద్‌ను రేసులో నిలిపాడు. అర్థ సెంచరీ తర్వాత వరుణ్ గౌడ్ నిష్క్రమించగా హైదరాబాద్‌కు మరో 39 పరుగులు అవసరం కాగా, చత్తీస్‌గఢ్ వికెట్ దూరంలో నిలిచింది. ఈ దశలో అనికెత్ రెడ్డి, రక్షణ్ రెడ్డి జోడీ అద్భుతం చేసింది. టీ విరామాన్ని 30 నిమిషాలు పొడగించినా.. ఈ జోడీ పట్టు వదల్లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బ్రేక్ ఇచ్చారు. అప్పటికి హైదరాబాద్ విజయానికి 12 పరుగుల దూరంలో నిలిచింది. మూడో సెషన్లో వేగం పెంచిన అనికెత్, రక్షణ్‌లు ముగించేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదు. అనికెత్ రెడ్డి ఓ సిక్సర్‌తో మెరువగా..
జయంత్ యాదవ్ ఓవర్లలో
లాంగ్ ఆఫ్ మీదుగా సిక్సర్ బాదిన రక్షణ్ రెడ్డి హైదరాబాద్ శిబిరంలో గెలుపు సంబురాలకు తెరతీశాడు. అంతకుమందు, ఓపెనర్ అభిరథ్ రెడ్డి (68, 110 బంతుల్లో 8 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. అర్థ సెంచరీతో చత్తీస్‌గఢ్‌పై ఎదురుదాడి చేశాడు. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (0), నైట్‌వాచ్‌మన్ రుతిక్ యాదవ్ (0) నిరాశపరిచినా.. రాహుల్ రాదేశ్ (39)తో కలిసి మూడో వికెట్‌కు 89 పరుగులు జోడించాడు. రాహుల్ రాదేశ్, కొడిమెల హిమతేజ (8), ప్రజ్ఞయ్ రెడ్డి (1) స్వల్ప స్కోరుకే వికెట్లు కోల్పోయారు. అభిరథ్ రెడ్డి సైతం పెవిలియన్‌కు చేరటంతో హైదరాబాద్ ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో కెప్టెన్ సీవీ మిలింద్ (22, 38 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) సైతం ఆకట్టుకునే ఇన్నింగ్స్ నమోదు చేశాడు. చత్తీస్‌గఢ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆఖరు వికెట్‌కు అర్థ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి హైదరాబాద్‌ను ఇరకాటంలో పడేసింది. ఆఖరు సెషన్ వరకు సాగిన థ్రిల్లర్‌లో హైదరాబాద్ 1 వికెట్ తేడాతో గెలుపొంది. ఈ విజయంతో రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బిలో హైదరాబాద్ 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రంజీ ట్రోఫీ తొలి దశ నాలుగు మ్యాచ్‌ల్లో హైదరాబాద్ మూడు విజయాలు సాధించి, పంజాబ్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. రెండో దశ రంజీ మ్యాచ్‌లు జనవరి రెండో వారంలో ఆరంభం కానున్నాయి. గ్రూప్-బిలో అస్సాం, సౌరాష్ట్రతో హైదరాబాద్ తలపడాల్సి ఉంది. రెండో దశ రంజీ మ్యాచ్‌లు జనవరి మూడో వారంలో ఆరంభం కానున్నాయి. గ్రూప్-బిలో అస్సాం, సౌరాష్ట్ర, కర్నాటకతో హైదరాబాద్ తలపడాల్సి ఉంది.
స్కోరు వివరాలు
చత్తీస్‌గఢ్ తొలి ఇన్నింగ్స్ : 284/10
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ : 280/10
చత్తీస్‌గఢ్ రెండో ఇన్నింగ్స్ : 254/10
హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్ : తన్మయ్ అగర్వాల్ (సి) ప్రతీక్ (బి) ఆదిత్య 0, అభిరథ్ రెడ్డి (బి) అజయ్ 68, రుతిక్ యాదవ్ (సి) అజయ్ (బి) ఆదిత్య 0, రాహుల్ (సి) తివారీ (బి) జయంత్ 39, హిమతేజ (సి) మయాంక్ (బి) జడేజా 8, వరుణ్ గౌడ్ (బి) జడేజా 55, చామా మిలింద్ (ఎల్బీ) జయంత్ 22, తనయ్ త్యాగరాజన్ (సి) తివారీ (బి) ఆదిత్య 8, అనికెత్ రెడ్డి నాటౌట్ 39, రక్షణ్ రెడ్డి నాటౌట్ 15, ఎక్స్‌ట్రాలు : 4,
మొత్తం : (79.4 ఓవర్లలో 9 వికెట్లకు) 259.
వికెట్ల పతనం : 1-0, 2-0, 3-89, 4-100, 5-140, 6-142, 7-182, 8-198, 9-220.
బౌలింగ్ : దేవ్ ఆదిత్య సింగ్ 7-1-28-3, ధర్మేంద్రసిన్హ్ జడేజా 32-6-87-2, జయంత్ యాదవ్ 22.4-5-66-2, అజయ్ మండల్ 18-0-74-2.







కామెంట్‌లు (0)