Magazines

వైజాగ్‌‌లో భారత్‌, శ్రీలంక వన్డే

2 గంటల క్రితం

ODI
avatar
balaji

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

కాలుష్యం నేపథ్యంలో వేదిక మార్పు

ముంబయి : భారత్‌, శ్రీలంక తొలి వన్డే వేదిక మారింది. దీపావళి, చలి మంచు కారణంగా డిసెంబర్‌లో న్యూఢిల్లీలో కాలుష్యం తీవ్రత ప్రమాదకర స్థాయిలో ఉంటుంది. గతంలోనూ ఈ సమయంలో ఢిల్లీలో మ్యాచ్‌‌లు షెడ్యూల్‌ ‌చేయటంపై తీవ్ర విమర్శలు రేగాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ ‌నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత్‌, శ్రీలంక తొలి వన్డే వేదికను మార్పు చేస్తూ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబర్‌ 13‌న ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరగాల్సిన వన్డే మ్యాచ్‌.. అదే రోజు విశాఖపట్నంలోని ఏడీఏ వీడీసీఏ స్టేడియంలో జరుగనుంది. 16న రెండో వన్డే బెంగళూరులో, 19న మూడో వన్డే అహ్మదాబాద్‌‌లో జరుగుతాయి. రాజ్‌‌కోట్‌, కటక్‌, పుణెలో టీ20 సిరీస్‌ ‌జరుగుతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్