ఆర్ష్‌దీప్‌కు నాలుగు, గుర్నూర్‌కు మూడు వికెట్లు
అర్ధసెంచరీతో రాణించిన కోహ్లి
తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం
ఆక్లాండ్: న్యూజిలాండ్‌పై గెలిచిన భారత జట్టు వన్డేల్లోనూ శుభారంభం చేసింది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో బుధవారం జరిగిన వర్షం కారణంగా కుదించిన మ్యాచ్‌లో భారతజట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. అన్షుల్ కంబోజ్(2/22) వరుస ఓవర్లలో కెప్టెన్ సాంట్నర్, నాథన్ స్మిత్‌లను ఔట్‌చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. కంబోజ్‌కి తోడు ఆర్ష్‌దీప్ నాలుగు, గుర్నూర్ బ్రార్ మూడు వికెట్లు పడగొట్టి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించారు. కివీస్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వర్షం కురవడంతో మ్యాచ్‌ను 32 ఓవర్లకు కుదించి భారత లక్ష్యాన్ని 143 పరుగులుగా నిర్ణయించారు.
ఆ లక్ష్యాన్ని భారత్ 22.4 ఓవర్లలో కేవలం 5 వికెట్లు కోల్పోయి సునాయంగా లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ(0) డకౌటైనా.. కెప్టెన్ గిల్, కోహ్లి రాణించి మ్యాచ్‌ను ముగించారు. దీంతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యతలో నిలువగా.. రెండో వన్డే వెల్లింగ్టన్ వేదికగా శనివారం జరగనుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కంబోజ్‌కు లభించింది. ఛేదనలో భాగంగా భారత బ్యాటర్లలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కోహ్లి(74; 51బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్)తో రాణించగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(37), అయ్యర్ (15) పరుగులతో మెరిసారు. రన్స్ చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ను సీఫర్ట్(38), మిచెల్ (28), ఫిలిప్స్ (30(, టిక్నర్ (34) పరుగులతో రాణించారు.
విరాట్ కోహ్లీ @ 13,000 పరుగులు
టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు జమ అయ్యింది. వన్డేల్లో మూడో నెంబర్లో బ్యాటింగ్‌కు దిగి 13వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఈ ఘనతను అందుకున్నాడు. వన్‌డౌన్ బ్యాటర్లలో హేమాహేమీ క్రికెటర్లు ఉన్నారు. అయితే ఆ జాబితాలో ఇప్పుడు కోహ్లీ టాప్‌లో నిలిచాడు. కేవలం సచిన్ టెండూల్కర్ మాత్రమే ఓ బ్యాటింగ్ పొజిషన్లో కోహ్లీ కన్నా ముందున్నాడు. సచిన్ టెండూల్కర్ రెండో నెంబర్ స్థానంలో అత్యధికంగా 13,685 పరుగులు స్కోరు చేశాడు. కోహ్లీ మూడవ నెంబర్ స్థానంలో 61.61 స్ట్రయిక్ రేట్‌తో 13వేల పరుగులు చేశాడు. ఆ జాబితాలో ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాంటింగ్ 12,662 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక బ్యాటర్ కుమార సంగక్కర 9747 పరుగులు, ఆ తర్వాత స్థానాల్లో జాక్వస్ కలిస్, కేన్ విలియమ్సన్, బాబర్ ఆజమ్, జో రూట్ ఉన్నారు.
స్కోర్‌బోర్డు...
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ం: యంగ్ (సి)శ్రేయస్ (బి)ఆర్ష్దఈప్ 8, షెఫర్ట్ (సి)గైక్వాడ్ (బి)గుర్రూర్ బ్రార్ 38, నికోల్స్ (సి)నమన్ ధీర్ (బి)ఆర్ష్‌దీప్ 9, మిఛెల్ (రనౌట్) రోహిత్/కెఎల్ రాహుల్ 28, లాథమ్ (సి అండ్ బి)గుర్నూర్ బ్రార్ 3, ఫిలిప్స్ (సి)శ్రేయస్ (బి)ఆర్ష్‌దీప్ 30, సాంట్నర్ (బి)కంబోజ్ 4, స్మిత్ (సి)కోహ్లి (బి)కంబోజ్ 1, జేమీసన్ (సి)కోహ్లి (బి)ఆర్ష్‌దీప్ 1, డఫీ (నాటౌట్) 15, టిక్నెర్ (సి)కెఎల్ రాహుల్ (బి)గర్నూర్ బ్రార్ 34, అదనం 13. (40.2ఓవర్లలో ఆలౌట్) 185పరుగులు.
వికెట్ల పతనం: 1/22, 2/40, 3/73, 4/84, 5/97, 6/113, 7/115, 8/131, 9/148, 10/185
బౌలింగ్: ఆర్ష్‌దీప్ 10-0-70-4, ఆకిబ్ నబీ 6-0-33-0, కంబోజ్ 10-2-22-2, గుర్నూర్ బ్రార్ 9.2-0-44-3, అక్షర్ పటేల్ 5-0-12-0.
ఇండియా ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి)సాంట్నర్ (బి)జేమీసన్ 0, గిల్ (సి)లాథమ్ (బి)స్మిత్ 37, కోహ్లి (సి)షెఫర్ట్ (బి)డఫీ 74, శ్రేయస్ అయ్యర్ (సి)నికోల్స్ (బి)డఫీ 15, అక్షర్ పటేల్ (సి)ఫిలిప్స్ (బి)డఫీ 0, కెఎల్ రాహుల్ (నాటౌట్) 3, నమన్ ధీర్ (నాటౌట్) 5, అదనం 9. (22.4ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 143పరుగులు.






కామెంట్లు (0)