Magazines

కార్తీక్ పసిడి తీన్‌మార్‌

45 నిమిషాల క్రితం

Karthik
avatar
balaji

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : హైదరాబాద్‌కు చెందిన 16 ఏండ్ల యువ స్విమ్మర్‌ కార్తీక్‌ ఆగ్నేయ ఎండ్యురో స్పోర్ట్స్‌ ఆక్వామోగా స్విమ్మింగ్‌ పోటీల్లో తీన్‌మార్‌ మోగించాడు. సోమవారం గోవాలోని బాంబిలిమ్‌ బీచ్‌లో జరిగిన ఓపెన్‌ వాటర్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించాడు. 5 కిమీ ఓపెన్‌ వాటర్‌ను 1 గంట 44 నిమిషాల్లోనే కార్తీక్‌ ఈదేశాడు. న్యూరోడైవర్జంట్‌ స్విమ్మర్‌ కార్తీక్‌.. డిసేబిలిటీ విభాగంతో పాటు జూనియర్‌ కేటగిరీ, సీనియర్‌ మెన్స్‌ విభాగంలో పసిడి పతకాలు సాధించాడు. మూడు పసిడి పతకాలు సాధించిన కార్తీక్‌ను తెలంగాణ పారా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి సమంత రెడ్డి అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్