గాయం నుంచి పూర్తిగా కోలుకోని స్టార్ క్రికెటర్
కివీస్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యే ప్రమాదం
బెంగళూరు : భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇరానీ ట్రోఫీలో రెస్టాఫ్ ఇండియాకు సారథ్యం వహించిన రిషబ్ పంత్ ఆ మ్యాచ్‌లో పక్కటెముకల గాయానికి గురయ్యాడు. గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కసరత్తులు మొదలెట్టాడు. వికెట్ కీపింగ్, బ్యాటింగ్ ఎటువంటి అసౌకర్యం లేకుండా సాధన చేస్తున్న రిషబ్ పంత్ ఫిట్నెస్ పరీక్షలో నెగ్గలేదు. దీంతో రిషబ్ పంత్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని వైద్యులు ఓ నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. భారత్-ఏ, న్యూజిలాండ్-ఏ జట్ల అనధికార టెస్టు సిరీస్‌లో ఆడాల్సిన రిషబ్ పంత్ ఫిట్నెస్ పరీక్షలో ఫెయిల్ కావటంతో బెంగళూరులోనే ఉండిపోయాడు. జశ్‌ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్‌లు ఫిట్నెస్ పరీక్షలు ముగించుకుని న్యూజిలాండ్‌లో ప్రాక్టీస్ సైతం షురూ చేశారు.
జురెల్‌కు చాన్స్?
భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు వెల్లింగ్టన్లో ఈ నెల 19 నుంచి ఆరంభం కానుంది. శనివారం నుంచి భారత్-ఏ, న్యూజిలాండ్-ఏ మూడో అనధికార టెస్టు షురూ కానుంది. పంత్ మూడో అనధికార టెస్టుకు దూరమయ్యాడు. మరో వారం రోజుల్లో ఫిట్నెస్ పరీక్షలో నెగ్గకపోతే, టెస్టు సిరీస్‌కు సైతం దూరమయ్యే ప్రమాదం ఉంది. రిషబ్ పంత్ స్థానంలో తిలక్ వర్మ భారత్-ఏ జట్టులో చేరాడు. జశ్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, ప్రసిద్ కృష్ణలు మూడో అనధికార టెస్టులో ఆడనున్నారు. పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి సైతం భారత్-ఏ జట్టుతో చేరాడు. అతడు సైతం శనివారం నుంచి రెడ్‌బాల్ ఫార్మాట్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురెల్ భారత్-ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
రిషబ్ పంత్ దూరమైతే టెస్టు సిరీస్‌కు ధ్రువ్ జురెల్ తొలి వికెట్ కీపర్‌గా ఎంపిక కానున్నాడు. పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. టెస్టు సిరీస్ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ సైతం మూడో అనధికార టెస్టులో ఆడతాడనే వార్తలు వచ్చినా, జట్టు మేనేజ్మెంట్ ఆ వార్తలను తోసిపుచ్చింది. అయితే, మూడో వన్డే ముగిసిన తర్వాత శుభ్‌మన్ గిల్ రెడ్‌బాల్ ప్రాక్టీస్ చేపట్టే అవకాశం ఉంది. అప్పుడు ఆఖరు రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ తొలి వన్డేలో ఆడలేదు. రెండో అనధికార టెస్టులో ఆడిన సిరాజ్‌కు జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చినట్టు తెలుస్తోంది. రెండో వన్డేలో సిరాజ్ తుది జట్టులోకి రానున్నాడు. భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే శనివారం జరుగనుంది.





కామెంట్లు (0)