
దుబ్బాక పట్టణ కేంద్రంలోని అంగడి బజార్ పోచమ్మ గుడి,శాస్త్రి విగ్రహం,డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయం వద్ద ఖాళీగా ఉన్న మున్సిపల్ షెటర్లకు రిజర్వేషన్ల ప్రకారం ఈనెల 23 న బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.బుధవారం దుబ్బాక లోని మున్సిపల్ ఆఫీస్ లో ఆయన మాట్లాడుతూ, అంగడి బజార్ వద్ద గల 16 షెటర్లలో ఉన్న వ్యాపారస్తులు రెన్యువల్ చేసుకోకపోతే.. వాటికి కూడా బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుందన్నారు.అంగడి బజార్ షెటర్లకు రూ.50 వేలు,శాస్త్రి విగ్రహం,డబుల్ బెడ్ రూమ్ సముదాయం వద్దనున్న షెటర్లకు రూ.25 వేలు మున్సిపల్ కమిషనర్ పేరిట ఏదైనా నేషనల్ బ్యాంకులో డీడీ తీసి దరఖాస్తు ఫారంతో పాటుగా లోకల్,క్యాస్ట్,పీహెచ్సీ సర్టిఫికెట్లను జతచేసి ఈ నెల 22 లోగా మున్సిపల్ ఆఫీసులో అందించాలన్నారు.పూర్తి వివరాలకు మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.