బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ.నరసింహారావు
నవతెలంగాణ-ముషీరాబాద్‌
కేంద్ర బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలంపాట ఆపాలని, సింగరేణికే నేరుగా గనులు కేటాయించాలని సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ. నరసింహారావు డిమాండ్‌ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్ట్‌) ముషీరాబాద్‌ జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో ముషీరాబాద్‌ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసనలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నరసింహారావు హాజరై మాట్లాడుతూ.. తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు గనులను వేలం పాట వేసి తెలంగాణకు తీవ్ర అన్యాయాన్ని చేస్తుందని, సింగరేణి మనుగడకే ప్రశ్నార్థకంగా మారుస్తుందన్నారు.
సింగరేణి కంపెనీ కూడా ప్రయివేట్‌ సంస్థలతో వేలంపాటలో పోటీపడాలని, తెలంగాణలో సింగరేణి కాలరీస్‌ బొగ్గు గనులను తవ్వకం కోసమే స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థ, కానీ నేడు కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు బొగ్గు గనుల కేటాయించకుండా తెలంగాణ రాష్ట్రంలోని గనులను ప్రయివేట్‌ సంస్థలకు అప్పజెప్పేటువంటి ప్రయత్నం చేస్తుందన్నారు. బొగ్గు గనుల వేలంపాట చర్యను మానుకోకపోతే ఉద్యమాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్‌ జోన్‌ కార్యదర్శి ఎం దశరథ్‌, నగర కమిటీ సభ్యులు ఆర్‌ వెంకటేష్‌, ఏ పద్మ జోన్‌ నాయకులు రమేష్‌, పాషా, విమల, చారి, పుష్ప, వెంకటేష్‌, మల్లయ్య, ఆంజనేయులు, పద్మమ్మ, రాజు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-అంబర్‌పేట
కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం పాట ఆపి సింగరేణికి నేరుగా కేటాయించాలని సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కుట్ర దాగి ఉందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొని అఖిలపక్షం సమావేశం నిర్వహించాలని సీపీఐ (ఎం) అంబర్‌పేట జోన్‌ కన్వీనర్‌ మహేం దర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారంసీపీఐ (ఎం) పార్టీ అంబర్‌పేట జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొగ్గు బ్లాకులన్నీ ప్రయివేట్‌ సంస్థలకు ఇచ్చిన తర్వాత సింగరేణికి మిగిలేదేముందని క్రమంగా సింగరేణి సంస్థను బలహీనపరచి మూతపడే వైపు మోడీ ప్రభుత్వం నెట్టుతుంద న్నారు. తెలంగాణకు మణిహారంగా ఉన్న సింగరేణిని కాపాడుకు నేందుకు రాష్ట్ర వ్యాపితంగా ప్రజలు కదలాలని కోరారు. కొత్త బ్లాకుల్లో తవ్వకాలు ప్రారంభించాలని కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇందుకు అనుమతించడం లేదు. వేలంపాట ద్వారా ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. వేలం పాట ప్రారంభం కార్యక్ర మంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో పాటు, రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క పాల్గొనడం ఆశ్చర్యకరం. ఇది వేలంపాట ప్రక్రియను ఆమోదించడమే కదా! గతంలో ప్రయివేటు సంస్థలకు అప్పగించిన మరో రెండు బ్లాకుల్లో ఇప్పటికీ తవ్వకాలు ప్రారంభం కాలేదు. అందువల్ల శ్రావణపల్లి బ్లాకుతో పాటు, ఆ రెండు బ్లాకుల ను కూడా తక్షణమే సింగరేణికి అప్పగించాలన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని కలుపుకుని కేంద్రం మీద ఒత్తిడి చేయాలని ఇందుకనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసు కోవాలని కోరారు. కేంద్రం ఆమోదించకపోతే రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలని కేవలం విజ్ఞప్తులతో సరిపెట్టవద్దని సింగరేణి పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను సమాయత్తం చేయా లని సీపీఐ (ఎం) డిమాండ్‌ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ అంబర్‌పేట జోన్‌ కమిటీ సభ్యులు జి.రాములు, ఎల్‌ సోమయ్య నాయకులు అశోక్‌, నర్సింగరావు, ధర్మ, తిరుపతి, వీర్య, శీను, అంజయ్య, వెంకన్న, పాష తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-మెహదీపట్నం
ప్రయివేట్‌ సంస్థలకు లాభం చేకూర్చడానికి కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన బొగ్గు గనుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని అలాగే ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణికి నేరుగా బొగ్గు గనులు కేటాయించాలని సీపీఐ (ఎం) నాంపల్లి జోన్‌ కన్వీనర్‌ మల్లేష్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉసురు తీసి కార్పొరేట్‌ సంస్థలకు లాభాలు చేకూర్చడం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా నాంపల్లి నియోజకవర్గ సీపీఐ(ఎం) పార్టీ కమిటీ ఆధ్వర్యం లో గుడిమల్కాపూర్‌ లక్ష్మీ నగర్‌ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వా నికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేష్‌ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ను సింగరేణి సంస్థకు ఇవ్వకుండా వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం విచారకరమన్నారు. తెలంగాణకు మణిహారంగా ఉన్న సింగరేణిని సీపీఐ (ఎం) ఆధ్వర్య ంలో ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకుంటా మని ప్రజలందరూ నిరసన కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ(ఎం) నాయకులు వెంకటస్వామి, ఆర్షద్‌, బాలయ్య, సిద్దయ్య, పకీర, వెంకటేష్‌, కష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love