రాష్ట్రంలో బొగ్గు గనుల వేలం వెంటనే ఆపివేయాలని సింగరేణి సంస్థను సంరక్షించుకోవాలని సీపీఐ(ఎం) ఎం ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోనీ పసర సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశనికి ముఖ్య అతిథిగా తుమ్మల వెంకట్ రెడ్డి హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అధికారం లోకి రాగానే బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ కేంద్రంగా బొగ్గు గల వేయడం దుర్మార్గమైన చర్యని, ఒకపక్క బొగ్గు గనులని ప్రవేటికరించమని పేర్కొంటూ, హైదరాబాద్ కేంద్రంగా వేలంపాటలు నిర్వహించారు. ఈ రోజు రాష్ట్రంలో సింగరేణి మీద 40 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. పరోక్షంగా ఇంకో 40 వేల మందికి ఉపాధి దొరుకుతున్నది. ఇలాంటి సింగరేణి కాపాడుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో బొగ్గును ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తికి ఉపయోగించుకుంటున్నది. గత ప్రభుత్వం మూడు బొగ్గు గనులను ప్రవేట్ కంపెనీలకు ఇస్తే హైదరాబాదులో జరిగిన బొగ్గు వేలంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొనడం కూడా పరోక్షంగా ప్రైవేటీకరణకు మద్దతు తెలపడవనని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 10 లక్షల కోట్లు పబ్లిక్ రంగ ఆస్తులని అమ్మడం ద్వారా ఆదాయం సంకూర్చుకోవాలని ఆలోచన చేస్తున్నదని పేర్కొన్నారు. వెంటనే సింగరేణి బొగ్గు వేలాన్ని నిలిపివేయాలని, సింగరేణికే బొగ్గు గనులు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ గోవిందరావుపేట మండల కార్యదర్శి తీగల ఆదిరెడ్డి మండల కమిటీ సభ్యులు సో మమల్లారెడ్డి, కడారి నాగరాజు, అంబాల మురళి, యానాల ధర్మారెడ్డి, పల్లపురాజు, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.