సఖి సేవలపై “లింగాలలో” అవగాహన

నవతెలంగాణ – తాడ్వాయి
సఖి సేవలపై శనివారం మండలంలోని “లింగాల” గ్రామపంచాయతీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సఖి కేంద్రం నిర్వాహకులు మాట్లాడుతూ నిరుపేదలకు, అభాగ్యులకు, మహిళలకు, పిల్లలకు, సంవత్సరాదాయం మూడు లక్షలు మించని వారికి సఖి కేంద్రం ఉచిత న్యాయ సహాయం అందిస్తుందన్నారు. సఖి కేంద్రం ద్వారా కౌన్సెలింగ్ సేవలు, న్యాయ సహాయం, పోలీస్ సహాయం, వైద్య సేవలు, తాత్కాలిక వసతి మొదలైన ఐదు రకాల సేవలు అందించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, మహిళలు, బాలికల చట్టాలు, గృహహింస చట్టం, సైబర్ క్రైమ్ తదితర చట్టాల పై అవగాహన కల్పించారు. అత్యవసర సమయాలలో 181,100, 1098, 1930 హెల్ప్ లైన్ నెంబర్ల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో సఖి సెంటర్ కౌన్సిలర్ కల్పన, పారా మెడికల్ స్టాఫ్ రాధా, కేస్ వర్కర్ మౌనిక, ఐటి అసిస్టెంట్ కిరణ్, లింగాల మాజీ సర్పంచ్ ఊకే కే మౌనిక నాగేశ్వరరావు, ఫీల్డ్ అసిస్టెంట్ ఊకే ప్రసాద్, గ్రామస్తులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love