నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
విశ్వ కర్మ పథకం సోమవారం ఉదయం 10:30 గంటలకు స్థానిక ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో, కొత్త కలెక్టర్ ఆఫీస్ రోడ్ లో ప్రధాన మంత్రి విశ్వకర్మ” అనే కేంద్ర ప్రభుత్వం యొక్క కొత్త పథకంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.విశ్వకర్మ కులస్తులైన చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే వారు, కుల సంఘాలు ఈ సదస్సుకు ఎక్కువ మంది హాజరు కావాలని సూచించారు.