అవగాహనతో కూడిన విద్య అవసరం: ఎమ్మెల్యే

నవతెలంగాణ – నవీపేట్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి అవగాహనతో కూడిన విద్య అవసరమని అన్నారు. మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బడిబాటలో భాగంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి 75% కంటే ఎక్కువ మార్కులు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ప్రతి మూడు నెలలకు ఒకసారి పాఠశాలలను తనిఖీ చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాలో 84,376 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు డ్రెస్సులను సకాలంలో అందించామని గత ప్రభుత్వం కంటే 25 రూపాయలు అదనంగా ఐకెపి మహిళలకు డ్రెస్సులను కుట్టడం కోసం ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి, డిఇఓ దుర్గాప్రసాద్, ఆర్ డి ఓ రాజేందర్, ఎంపీపీ శ్రీనివాస్,ఎమ్మార్వో నారాయణ, ఎంపీడీవో నాగనాథ్, బుచ్చన్న, ఎంపీటీసీ మీనా నవీన్ రాజ్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love