ప్రస్తుతం జరుగుతున్న దొంగతనాలు సైబర్ నేరాలపై నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గోల్డ్ షాప్ (మర్చేంట్) ఓనర్స్ కి ప్రస్తుతం జరుగున్న దొంగతనాలు, సైబర్ నేరల పై అవగాహనా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిజామాబాద్ ఏసిపి రాజ వెంకటరెడ్డి, ఒక టోటల్ ఎస్హెచ్ఓ రఘుపతి పలు సూచనలు చేశారు.ఫిసికల్ సెక్యూరిటీ గార్డు లను నియమించుకోవాలి. హై సెక్యూరిటీ లాక్ లను వాడాలి. బిజినెస్ సమయం తరువాత గోల్డ్, క్యాష్ సేఫర్ లో భద్రపర్చాలి, సేఫర్ లు ఎవరికీ కనిపించని ప్లేస్ లో పెట్టాలి. క్యాష్ ట్రాన్సక్షన్స్ ను తగ్గించి, డిజిటల్ ట్రాన్సక్షన్స్ మాత్రమే చేయాలి. షాప్ లల్లో హై రిజల్లుషన్ సీసీటీవీ కెమెరాలు బిగించాలి, వాటిని క్లౌడ్ స్టోరేజ్ కి అనుసంధానం చేయాలి. షాప్ లల్లో అలారం సిస్టం ని ఇన్స్టాల్ చేసుకోవాలి, వాటిని పోలీస్ స్టేషన్ కి అనుసంధానం చేయాలి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఏ విధంగా నడుచుకోవాలో పని వాళ్లకు ముందే ట్రయల్ చేపించాలి. సరి పడు గూర్కాలని నియమించి, తగు పెట్రోలింగ్ ని ఏర్పాటు చేయాలి. ప్యానిక్ బటన్స్ ని ఏర్పాటు చేసుకొని అవసరం అయినప్పుడు ఉపయోగించాలి. క్యాష్, గోల్డ్ తరలించే వాహనాల కు జిపిఎస్ ట్రాకెర్స్ ను ఏర్పాటు చేయాలి, దొంగతనం, బర్గ్లరీ, డామేజెస్ సెక్యూర్ కంప్రెహేన్సివే ఇన్సూరెన్సు కవరేజ్ చేపించాలి.ఇందులో దాదాపు 100 మంది గోల్డ్ షాప్ యజమానులు పాల్గొన్నారు.