నవతెలంగాణ -దౌల్తాబాద్ : పయనీర్ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందని పయనీర్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ అశోక్ రెడ్డి అన్నారు. బుధవారం దౌల్తబద్ మండలం నర్సంపేట గ్రామంలో కార్టేవ అగ్రిసైన్స్ కంపెనీకి చెందిన పయనీర్ బ్రాండ్ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం రకం పీ3302 రైతు శివంది నాగరాజు పొలంలో క్షేేత్ర ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేేత్ర ప్రదర్శనకు హాజరైన రైతులు నాగరాజు మొక్కకజొన్న పంట చూసి హర్షం వ్యక్తం చేశారు.వచ్చే సంవత్సరం వర్షాధారంగా పయనీర్ పీ3302మాత్రమే సాగు చేయాలని నిర్ణయించుకున్నారు.పి 3302 రకం ఎకరానికి 40 క్విింటాల్ల దిగుబడి వస్తుందన్నారు. పి3302 ప్రతికూల పరిస్థితుల్లో కూడా అత్యధిక దిగుబడి యిస్తుందన్నారు. అలాగే కొత్త హైబ్రిడ్ పి35105 అనే రకం వచ్చే వర్షాకాలంలో సమానమైన కండేలు, గాలి వానలకు పడిపోని రకం,నాణ్యమైన గింజ రంగు కలిగి ఉండటం వలన మంచి దిగుబడి వస్తుందనీ తెలిజేశారు.ఈకార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు భానుప్రకాశ్, సంగమేశ్వర ట్రేడర్ నాగప్ప, హిమాలయ ట్రేడర్ బునరీ సంజయ్, వ్యవసాయ విస్తరణ అధికారి, రైైతులు తదితరులు పాల్గొన్నారు.