ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన..

నవతెలంగాణ – బొమ్మలరామారం 
గ్రామీణ ప్రజలందరూ బ్యాంకులు అందిస్తున్న సేవల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం.నాగమణి, ఆర్థిక అక్షరాస్యత కేంద్రం మండల కోఆర్డినేటర్ విశ్వనాధ్ లు అన్నారు. బుధవారం మండలంలోని తుంకుంట, రామలింగం పల్లి లో ఆర్థిక అక్షరాస్యత పై ప్రజల  అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. తూంకుంట అంగన్వాడి కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. పొదుపు, ప్రధానమంత్రి బీమా, సుకన్య సమృద్ధి యోజన లాంటి పథకాలన్నీ బ్యాంకుల ద్వారా ప్రజలందరికీ చేరవేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. సుకన్య  సమృద్ధి యోజన పథకంలో భాగంగా 10 ఏళ్ల లోపు  బాలికలకు పొదుపు ఖాతాలను ప్రారంభించి,వంద శాతం సాధించిన మండలంగా బొమ్మలరామారాన్ని తీర్చిదిద్దాలన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక చేకూర్పులో భాగంగా ఆర్థిక అక్షరాస్యతను ప్రజల్లో పెంపొందించడానికి ఆర్థిక మోసాలను అరికట్టడానికి, ఆర్థిక మోసాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ (ఎస్ ఎస్ టీ) ఎన్జీవో సంస్థ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని పూర్తి ఆర్థిక అక్షరాస్యతను సాధించాలని కోరారు.  కార్యక్రమంలో కీసర సి ఎఫ్ ఎల్ భాను శ్రీ, అంగన్వాడీ టీచర్లు డి . నాగమణి, బాలమణి, సబిత,మహిళలు ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love