సమాచార హక్కు చట్టంపై అవగాహన..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల సిద్ధార్థ జూనియర్ కళాశాలలో గురువారం రోజు 2005 సమాచార హక్కు చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్టు సమాచార హక్కు చట్టం 2005 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెగ్గేలా రాజు తెలిపారు. ఈ సందర్భంగా సహచట్టం రాష్ట్ర డైరెక్టర్ మాజీ న్యాయమూర్తి సలీం హాజరై చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు అక్టోబర్ 12 2005 సంవత్సరంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి రావడం జరిగిందని దానికి సంబంధించిన సెక్షన్లను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సాహిల్ ఖాన్ , కళాశాల ప్రిన్సిపాల్ మనోహర్ రెడ్డి మహిళల అధ్యక్షురాలు బేర్జానా బేగం, జిల్లా సలహాదారులు లింగమయ్య , మదర్ పాష, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో రైట్ అప్.. మండల కేంద్రంలో గల సిద్ధార్థ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగిస్తున్న దృశ్యం.

Spread the love