దామరచర్ల లోని గిరిజన బాలికల గురుకుల కళాశాలలో జిల్లా మహిళా సాధికారత సాధికారత సంస్థ ఆధ్వర్యంలో గురువారం బేటి బచావో – భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా కిశోర బాలికలకు రుతుక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిడిపిఓ ఎన్ చంద్రకళ మాట్లాడుతూ.. రుతుక్రమం సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, వ్యక్తిగత పరిశుభ్రత, రుతుక్రమ సమస్యలు ఎంచుకున్న లక్ష్యాలకు ఆటంకం కలిగించకుండా ఉండాలంటే, తగిన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. సమస్యలు ఎదురైనప్పుడు బాలికలు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నడవాలని కోరారు. లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని, భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో గుడ్ యూనివర్స్ ఎన్జీవో తబూసు బాలికల కు ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ బాలాజీ నాయక్, డాక్టర్ నసీమా బేగం, కళాశాల ప్రిన్సిపాల్ స్వరూప, ఐసిడిఎస్ సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్స్ విద్యార్థులు పాల్గొన్నారు.