
తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం శనివారం మద్నూర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని తడి ఇప్పర్గా, సలాబత్పూర్, పెద్ద తడగూర్, గ్రామాల్లో కల్తీకల్లు పైన మరియు మాదకద్రవ్యాల పైన ర్యాలీలు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఎక్సైజ్ శాఖ ఇట్టి అవగాహన కార్యక్రమంలో నార్కోటిక్ డిపార్ట్మెంట్ తదితరులు రెవెన్యూ శాఖ ప్రజలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. కల్తీ కల్లులో కలిపే ప్రమాదకరమైన మాదకద్రవ్యాల గురించి తెలియజేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలు అవగాహన సదస్సులో మద్నూర్ ఎస్సై విజయ్ కొండ ఎక్సైజ్ శాఖ అధికారులు నార్కో టిక్ డిపార్ట్మెంట్ వివిధ పార్టీల నాయకులు ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.