
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి సందర్భంగా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి వారి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొలుపుల అమరేందర్, మాజీ జెడ్పిటిసి సుబ్బూరు బీరు మల్లయ్య, జిల్లా నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య , బిఆర్ఎస్ పార్టీ భువనగిరి పట్టణ, మండల అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, జనగాం పాండు, ఆ పార్టీ పట్టణ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్ రెడ్డి, నీల ఓం ప్రకాష్ గౌడ్, నాయకులు ఇట్టబోయిన గోపాల్,ఎనబోయిన జాంగిర్, తుమ్మల పాండు, కుశంగల రాజు, రాకల శ్రీనివాస్,కంచి మల్లయ్య, సుభాష్ ,సురేష్, శివకుమార్,నాగు ,నితీష్ ,సూరజ్ సైదులు ,సతీష్ గౌడ్, రాజేష్ లు పాల్గొన్నారు.